ఐపీఎల్ -2025 లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో CSK నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై, 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ 25 బంతుల్లో 31 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా నమన్ ధీర్ (17), రియాన్ రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), రాబిన్ మింజ్ (3), మిచెల్ శాంట్నర్ (11) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. దీపక్ చాహర్ 15 బంతుల్లో 28 పరుగులు చేసినా జట్టుకు విజయం దక్కలేదు.
సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ మూడు, అశ్విన్, నాథన్ఎల్లిస్ చెరొక వికెట్ తీశారు.
చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (53),రచిన్ రవీంద్ర (65*) చెలరేగారు. రాహుల్ త్రిపాఠి (2), శివమ్ దూబె (9), దీపక్ హుడా (3) విఫలయ్యారు.
ముంబై బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు విఘ్నేశ్ పుతూర్ మూడు వికెట్లు తీయగా దీపక్ చాహర్, విల్ జాక్స్ చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్