భారత భూ భాగంలో చైనా కౌంటీలు ఏర్పాటు చేస్తోందని కేంద్రం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ వెల్లడించారు.లడ్డాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా ఏర్పాటు చేస్తోన్న రెండు కొత్త కౌంటీల్లో భారత భూ భాగాలున్నాయని మంత్రి తెలిపారు. ఈ విషయంలో దౌత్యపరంగా నిరసన తెలిపినట్లు మంత్రి గుర్తుచేశారు. సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల గురించి కూడా కేంద్రానికి తెలుసని మంత్రి చెప్పారు.
సరిహద్దులో రోడ్ల నిర్మాణానికి మూడు రెట్లు నిధులు పెంచినట్లు కేంద్ర మంత్రి కీర్తి వర్థన్ సింగ్ తెలిపారు. చైనా అనుసరిస్తున్న విధానాలపై దౌత్య పరంగా పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్