తిరుమల వైకుంఠ దర్శనం టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై విచారణ కమిషన్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి మూడో సారి విచారణ చేపట్టారు. విచారణకు ఈ నెల 17న హాజరుకావాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోలకు సమన్లు జారీ చేశారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, తిరుమల తిరుపతి ఈవో శ్యామలరావుకు కమిషన్ సమన్లు జారీ చేసింది. మార్చి 17న తిరుపతిలో జరిగే విచారణకు హాజరు కావాలంటూ జస్టిస్ సత్యనారాయణ కమిషన్ సమన్లు జారీ చేసింది. జనవరి 8న జరిగిన తొక్కిసలాటలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.