లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా జరుగుతుందన్న రాజ్ నాథ్ సింగ్ , శాసనసభ లో అయినా లోక్ సభ లో అయినా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య సహజంగానే పెరుగుతుందన్నారు. నిర్ణయం న్యాయంగా ఉంటుందన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ లేవనెత్తే అంశాలపై అధికారులు ఆయనతో చర్చిస్తారన్నారు.
దక్షిణాదిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా సీట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందనేది సరైన వాదన కాదు అని హితవు పలికారు.
దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో జనాభా ఎక్కువగా ఉంది. అందువల్ల ఉత్తరాధిలోని యూపీ, బిహార్ లో పార్లమెంటు సీట్లు భారీగా పెరిగే అవకాశముందని పలువురు అంచనా వేస్తున్నారు.