ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి చెందారు. అవుటర్రింగు రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
హైదరాబాద్ మాజీ మేయర తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్రెడ్డి నడుపుతోన్న కారు లారీని వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అవుటర్రింగురోడ్డు గొల్లపల్లి కమాన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కనిష్క్రెడ్డిని మలక్పేట యశోధా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ ఆయన మరణించారు.కనిష్క్రెడ్డి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.