వైసీపీ కీలక నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు ఎదుర్కొంటున్న పోసానికి రాజంపేట మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు వారాలుగా ఆయన రాజంపేట జైల్లో ట్రయల్ ఖైదీగా ఉన్నారు.
పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల పోలీసులు పిటీ వారెంట్లతో పోసాని కోసం రాజంపేట జైలు వద్దకు క్యూ కట్టారు. పోసానికి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. కేవలం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాత్రమే బెయిల్ లభించిందా అనే విషయం తెలియాల్సి ఉంది.