అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకు వస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మస్క్నకు అప్పగించినట్లు చెప్పారు. మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ ఇందుకు ఓ క్యాప్సూల్‌ను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తరవాత అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమి మీదకు తీసుకువచ్చే ప్రక్రియ మొదలవుతుంది.
వారం రోజుల పరిశోధనలకు గత ఏడాది అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సాంకేతిక లోపాల కారణంగా 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని భూమికి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయలేదని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. వారంలో వ్యోమగాములను భూమికి తీసుకువస్తామని చెబుతున్నారు.