Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

ముస్లిం సంఘం ఫిర్యాదుతో ఛావా తెలుగు డబ్బింగ్ చిత్రం విడుదల ఆగుతుందా?

Phaneendra by Phaneendra
Mar 6, 2025, 12:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా సినిమా తెలుగు అనువాదం మార్చి 7న విడుదల కానుంది. అయితే ఆ చిత్రం విడుదలను నిలువరించాలంటూ కొందరు ముస్లిములు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రబోధించే ఛావా చలనచిత్రం దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ దక్కించుకుంది. చాలాకాలం తర్వాత హిందీ చిత్రపరిశ్రమకు మంచి విజయం లభించింది. దాంతో ఆ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఛావా సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఆ సినిమాపై జాతీయవాద వ్యతిరేకులు మండిపడుతున్నారు.  

ఛావా సినిమా తెలుగు వెర్షన్ విడుదలను ఆపేయాలంటూ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సంస్థ పేరిట కొంతమంది ముస్లిములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. ఆ సినిమాలో ఔరంగజేబును దుష్టుడిగా చూపించడంపై దేశవ్యాప్తంగా పలువురు ముస్లిములు మండిపడుతున్నారు. శంభాజీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

నిజానికి జాతి వ్యతిరేక ప్రచారంతో కూడుకున్న తప్పుడు చరిత్ర చిత్రాలు విడుదలైనప్పుడు సోకాల్డ్ మేధావులంతా వాటిని ఈ దేశపు నిజమైన చరిత్ర అంటూ ప్రచారం చేసారు. అలాంటివాటిని హిట్ చేయడం సమాజం బాధ్యత అంటూ ఊదరగొట్టారు. మొగలే ఆజం, అనార్కలి, తాజ్‌మహల్, జోధా అక్బర్ వంటి చిత్రాలను కళాఖండాలు అంటూ ఆదరించి దేశం నెత్తిన రుద్దారు. మన దేశ ప్రజలకు జరిగిన అన్యాయాలను చరిత్రకెక్కించాలి అనే ఉద్దేశంతో తీసిన కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి చిత్రాలను మాత్రం ముస్లిములకు వ్యతిరేకం, వివాదాస్పదం అంటూ తప్పుడు ప్రచారం సాగించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఛావా సినిమా మీద కూడా దుష్ప్రచారం జరుగుతోంది.

అసలు, దుష్టుడైన ఔరంగజేబును జాతీయవాది అయిన శంభాజీ అనే రాజు ఎదుర్కొంటే వారికి ఎందుకు నొప్పి కలుగుతోంది? అందులో మతం ప్రసక్తి ఏముంది? ఐదారు తరాల క్రితం ఈ దేశంలో ముస్లిం అన్నవాడే లేడు కదా. ఇప్పుడున్న ముస్లిములు అందరూ ఏదో ఒక రూపంలో మతం మారినవారే కదా. వారిని ఇప్పటికిప్పుడు ఎవరూ తమ మతం వదిలిపెట్టి రమ్మని అడగడం లేదు. ఒక దుష్టుడైన రాజుకు, మరో మంచివాడైన రాజుకు మధ్య జరిగిన ఘర్షణగానే చూడవచ్చు కదా. హిందువులను విలన్లుగా ఉద్దేశపూర్వకంగా చూపించే వందల సినిమాలను కేవలం సినిమాలుగా చూడాలి అని వాదించేవారు, ఈ చిత్రాన్నీ అదే దృక్కోణంతో ఎందుకు చూడడం లేదు? ఔరంగజేబును తమ మతానికి ప్రతినిధిగా చూస్తున్నారు ఎందుకు? అందుకే, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.

ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు వల్ల ఆ సినిమా విడుదల ఆగుతుందా? అన్నది ఇంకొక్క రోజులో తేలిపోతుంది.

Tags: ChhaavaaMuslims ComplaintNellore District CollectorRelease ControversyTelugu Dubbed FilmTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.