బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడ్డ రొహింగ్యాలు క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లో తిష్టవేశారు. తాజాగా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నార్సింగ్ తండాలో ముగ్గురు రొహింగ్యాలకు తన ఫామ్ హౌసులో ఆయూబ్ అనే వ్యక్తి మూడేళ్లుగా ఆశ్రయం కల్పించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, పాసుపోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రొహింగ్యాలపై అక్రమ వలసల చట్ట కింద కేసు నమోదు చేశారు.
మూడో కంటికి తెలియకుండా గ్రామంలో ఎక్కడా అనుమానం రాకుండా ఆయూబ్ అనే వ్యక్తి రొహింగ్యాలకు తన ఫామ్ హౌసులో ఆశ్రయం కల్పించాడు. ఫామ్ హౌసులో ఉన్న గదులను ఎవరికీ ఇవ్వకుండా కేవలం రొహింగ్యాలకు కేటాయించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రొహింగ్యాలు గత పదేళ్లుగా భారత్లో పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బంగ్లాదేశ్ రొహింగ్యాల నుంచి ఒక్కొక్కరి నుంచి 30 వేలు తీసుకుని భారత్ తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన రొహింగ్యాలు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్