తునిలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా, ఇవాళ మరోసారి ఎన్నిక జరపాలని అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు వైస్ ఛైర్మన్ ఇంటి వైపు కదిలారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
వైసీపీ కౌన్సిలర్లను దాడిశెట్టి రాజా కిడ్నాప్ చేశాడంటూ టీడీపీ నేతలు విమర్శించారు. కౌన్సిలర్లు అందరూ టీడీపీకి ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారని వారు చెబుతున్నారు.
ఛలో తునికి వైసీపీ నేతలు పిలుపు నివ్వడంతో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. తునిలో 163 (2)సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చారు. ఐదుగురికంటే ఎక్కువ మంది ఒక చోటు గుమిగూడరాదని పోలీసులు హెచ్చరించారు.
తునికి బయలు దేరిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి, వంగా గీతను పోలీసులు వెనక్కు పంపారు. సాయంత్రం 6 గంటల వరకు తునిలో పోలీసుల ఆంక్షలు కొనసాగనున్నాయి. వైసీపీ కౌన్సిలర్లను బెదిరింపు తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.