Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

చిలుకూరు ఘటనలో ఆరుగురి అరెస్ట్, రంగరాజన్‌ను పరామర్శించిన రేవంత్

Phaneendra by Phaneendra
Feb 11, 2025, 09:54 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని చిలుకూరు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేసారు. తమకు ఆర్థికంగా సహాయం చేయాలని డిమాండ్ చేసి, దానికి ఆయన ఒప్పుకోకపోవడంతోనే నిందితులు రంగరాజన్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు.

దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటన చేస్తూ ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసామని వెల్లడించారు. సోమవారం ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్నాడు. 2022లో అతను రామరాజ్యం అనే సంస్థను ప్రారంభించాడు. ఆ సంస్థలో చేరిన వారికి రూ.20వేలు జీతం ఇస్తానని ప్రకటనలు చేసాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, కోటప్పకొండ ప్రాంతాల్లో పర్యటించి కొంతమందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి మూడు వాహనాల్లో చిలుకూరు వెళ్ళాడు. అక్కడ వారు బాలాజీ గుడి ప్రధానార్చకులు రంగరాజన్‌ను కలిసారు. తమ సంస్థలో సభ్యులను చేర్పించాలనీ, ఆర్థికంగా సహాయం చేయాలనీ డిమాండ్ చేసారు. దానికి ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాకబు చేసారు. సోమవారం నాడు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించే ప్రసక్తే లేదన్నారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. సీఎం సూచనల మేరకు తెలంగాణ దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ చిలుకూరు వెళ్ళారు. రంగరాజన్‌ను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అర్చకులు రంగరాజన్‌కు అండగా ఉంటామన్నారు.

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చిలుకూరు ఘటనను తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ విద్యాధికులని, ఉన్నతస్థాయి పదవులను సైతం పరిత్యజించారనీ గుర్తు చేసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నత ధార్మిక విలువలను పాటిస్తున్నారని తెలియజేసారు. అలాంటి గౌరవప్రదమైన అర్చకవృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన దాడి గర్హనీయం, దురదృష్టకరం, బాధాకరం అని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావు లేదని, దౌర్జన్యాలూ బెదిరింపులకు స్థానం లేదనీ అన్నారు. చిలుకూరు ఘటన ఒక వ్యక్తి మీద కాదు, సనాతన ధర్మం మీద జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు.

Tags: Balaji TempleChilukurEndowments Minister Konda SurekhaHead Priest RangarajanHyderabadPriest AttackedTelanganaTelangana CM Revanth ReddyTOP NEWSUnion Minister G Kishan Reddy
ShareTweetSendShare

Related News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

Latest News

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.