మెక్సికోలో ఘోరం జరిగింది. ఓ బస్సులో ప్రయాణిస్తోన్న 38 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. మెక్సికో పోలీసులు ప్రమాద కారణాలను గుర్తించే పనిలో పడ్డారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.
దక్షిణ మెక్సికో టబాస్కో రాష్ట్రంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 38 మంది ప్రయాణీకులతో వెళుతోన్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఇద్దరు డ్రైవర్లు కూడా మంటలకు ఆహుతి అయ్యారు. ఎవరూ తప్పించుకోలేకపోయారు. దీంతో ప్రమాద కారణాలు తెలియరావడం లేదు. దుండగులు కావాలని చేశారా? ప్రమాదవశాత్తూ జరిగిందా అనే దానిపై మెక్సికో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే 18 మంది అవశేషాలను గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే పని చేపట్టారు. కనీసం డ్రైవరు కూడా తప్పించుకోలేని అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.