పొరుగుదేశం బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. అవామీలీగ్ పార్టీ నేతలే లక్ష్యంగా ఆందోళనకారులు చెలరేగిపోతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా, బంగబంధు హిజబుల్ రెహ్మాన్ చిత్రపటాలను నిరసనకారులు తగులబెట్టారు. 24 జిల్లాల్లో బంగబంధు కుడ్య చిత్రాలను దహనం చేశారు. భారత్లో ఆశ్రయం పొందుతోన్న మాజీ ప్రధాని షేక్ హసీనా మూడు రోజుల కిందట విడుదల చేసిన వీడియోతో బంగ్లాదేశ్లో అల్లర్లు మరలా ప్రారంభం అయ్యాయి.
ఆందోళన కారులు అవామీలీగ్ నాయకుల ఇళ్లను ధ్వంసం చేసి, దహనం చేస్తున్నారు. దొరికిన వస్తువులు దోచుకెళుతున్నారు. దాడులు ఆపకపోతే దేశ అస్థిత్వం ప్రమాదంలో పడి నిరంకుశ శక్తుల చేతుల్లోకి అధికారం వెళుతుందని తాత్కాలిక ప్రధాని యూనస్ హెచ్చరించారు.
బంగ్లాదేశ్లో గత జూన్లో రిజర్వేషన్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర హింసకు దారితీసింది. తరవాత జరిగిన హింసలో 600 మంది ప్రాణాలు కోల్పోయారు. హసీనా దేశం విడిచి ఇంగ్లాండ్ పారిపోయే క్రమంలో అనూహ్యంగా భారత్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలతో బంగ్లాదేశ్ మరోసారి రగులుతోంది.
అమెరికా నుంచి అక్రమ వలసదారులను ఎలా అయితే వెనక్కు పంపుతున్నారో, రొహింగ్యాలను, బంగ్లాదేశ్ నుంచి భారత్ అక్రమంగా చేరుకున్న వారిని ఏరివేయాలని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి వారిని గుర్తించి బంగ్లాదేశ్ తరలించాలని డిమాండ్ మొదలైంది.