ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఫిబ్రవరి 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.మంత్రులు అన్ని విషయాలను అధ్యయనం చేసి, సభలో సమాధానాలు ఇచ్చేలా సిద్దమై సభకు రావాలని సీఎం ఆదేశించారు.
బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేది లేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. సభలో ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం తనకు కూడా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానంటూ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే వైసీపీ నుంచి గెలిచిన 10 మంది సభ్యుల్లో కొందరు మాత్రమే సభకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది.