వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ పలు సవరణలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు 44 సవరణలు ప్రతిపాదించగా, 14 సవరణలకు జేపీసీ అంగీకరించింది. 14 ప్రతిపాదనలను కమిటీ ఆమోదించినట్లు జేపీసీ ప్యానెల్ ఛైర్మన్ జగదాంబక పాల్ వెల్లడించారు. సవరణలు చట్టాన్ని మరింత బలంగా మారుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్డీయే కూటమి ఎంపీల ప్రతిపాదనలకు జేపీసీ ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీల సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. వీటిపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జేపీసీ ఆమోదం తెలిపిన బిల్లుకు జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్సభకు చేరనుంది.