ఒకే దేశం, ఒకే సమయం అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశమంతా ఒకే ప్రామాణిక సమయం తీసుకువచ్చేందుకు ఐఎస్టీ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త ముసాయిదా నిబంధనలు తయారు చేసింది. వచ్చే నెల 14లోపు ప్రజలు తమ అభిప్రాయాలు తెలపడానికి అవకాశం కల్పించింది.
భారత ప్రామాణిక సమయం ఐఎస్టీపై 2024లో చట్టపరమైన విధివిధానాలు రూపొందించారు. ఇది అమల్లోకి వస్తే పాలన, చట్ట, వాణిజ్య, ఆర్థికరంగాల్లో పురోగతి వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక పత్రాల్లోనూ ఐఎస్టీ తప్పనిసరి అవుతుంది. ముసాయిదా నిబంధనల ప్రకారం ఐఎస్టీ మినహా ఇతర టైం జోన్లు ప్రస్తావించడాన్ని నిషేధిస్తారు.అయితే సముద్రయానం, శాస్త్రీయ పరిశోధనలు, అంతరిక్ష రంగాలకు మినహాయింపు ఇచ్చారు.