ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన 76వ గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు, ప్రముఖులు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.
గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిపోయిందని, ఈ ప్రభుత్వం అభివృద్ధిని కోరుకుంటోందని గవర్నర్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేంద్రం భారీగా నిధులు అందించిందని గుర్తుచేశారు. అందరికీ ఆరోగ్యం, సంపద, అందరికీ ఆనందం అనే పది సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాక్షించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గుర్తుచేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ సాధించేందుకు, ఏపీ తనవంతు పాత్ర పోషించాలన్నారు.