ముంబైపై 26/11 దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. 2008లో ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు 12 చోట్ల ఏకకాలంలో సృష్టించిన మారణహోమం కుట్ర వెనుక తీవ్రవాది హెడ్లీకి తహవూర్ రాణా సహకారం అందించాడని దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రాణాను చికాగో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అమెరికాలో అనేక కోర్టులో తహవూర్ రాణా విచారణ సాగింది. రాణాకు భారత్‌కు అప్పగించాలని చేసిన న్యాయపోరాటం ఫలించింది. రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. న్యాయప్రక్రియ పూర్తి కాగానే లాస్ ఏంజలెస్ జైల్లో ఉన్న రాణాను భారత్‌కు అప్పగించనున్నారు.
2008లో పాకిస్థాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు కొలాబా తీరం ద్వారా ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్లో, తాజ్ హోటల్లో దూరి ఏకీ 47తో విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక సూత్రధారి హెడ్లీకి, రాణా సహకరించాడని రుజువైంది. అమెరికాకు పారిపోయిన రాణాను చికాగో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. న్యాయప్రక్రియ పూర్తి కావడంతో రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.