ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమా ఇవాళ విడుదలైంది. పద్మావతి మల్లాది ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.