ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన జేడీయూ ఎమ్మెల్యే
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేడీయూ ఎమ్మెల్యే పై ఆ పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకుంది. జేడీయూ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ పార్టీ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఐదుగురు జేడీయూ సభ్యులు బీజేపీలో చేరారు. దీంతో జేడీయూకు ఒకే ఎమ్మెల్యే మిగిలారు. ఇప్పుడు అతను కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నాడు.
మణిపూర్ శాసనసభలో 60 మంది సభ్యులుండగా బీజేపీ తో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీయేలో జేడీయూ భాగస్వామిగా ఉంది.