ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యం
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20 సిరీస్లో భారత్ 1–0 ఆధిక్యంలో ఉంది. కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ పై ఏడువికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (68), హ్యారీ బ్రూక్( 17), జోఫ్రా ఆర్చర్( 12) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, అర్ష్ దీప్ , అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.
ఫిట్నెస్ పరీక్ష అనంతరం భారత జట్టులోకి చోటు దక్కించుకున్న పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. ఈ మ్యాచ్ లోకి తీసుకోకపోవడానికి కారణాలను మేనేజిమెంట్ వెల్లడించలేదు.
లక్ష్యఛేదనలో భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి విజయం సాధించింది. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. సంజు శాంసన్( 26),తిలక్ వర్మ (19 నాటౌట్), హార్దిక్ పాండ్యా (3 నాటౌట్) గా మ్యాచ్ ముగిసే సమయానికి క్రీజులో ఉన్నారు.
ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.