ఖగోళంలో ఈ నెల 22న అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు రానున్నాయి. పరికరాల సాయం లేకుండానే నేరుగా ఆ దృశ్యాన్ని భూమిపై నుంచి చూసేందుకు అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి 31 వరకు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది.
శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. దీనినే ప్లానెటరీ అలైన్మెంట్, లేదా పరేడ్ ఆఫ్ ప్లానెట్స్గా పిలుస్తారు.
వాస్తవానికి గ్రహాలకు మధ్య దూరం ఎక్కువగానే ఉంటుంది. కానీ, అంతరిక్షంలో వరుస క్రమంలో ఉండవు. భూమిపై నుంచి చూసిన సమయంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి.
శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లను చూసేందుకు ఫిబ్రవరి ప్రారంభం ఉత్తమమైన సమయంగా ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
మార్చిలో అంగారకుడు, బృహస్పతి, యురేనస్, వీనస్, నెప్ట్యూన్, శని, మెర్క్యురీ గ్రహాలు ఒకేవరుసలో కనిపిస్తాయి. దీనిని గ్రేట్ ప్లానెటరీ అలైన్మెంట్గా పిలుస్తారు.
సూర్యాస్తమయం తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. రాత్రి 11.30 గంటల తర్వాత మళ్లీ కనిపించవు. అమెరికా, మెక్సికో, కెనడా, భారత్లో చూసేందుకు అవకాశం ఉంది.