ఇంత పెద్ద సభ హిందూ సమాజపు సామూహిక సంకల్పపు ఘోషణ. ప్రజాస్వామ్యంలో ఏం జరగాలో నిర్ణయించేది ప్రజలు. అన్ని రాష్ట్రాల్లోనూ హిందూ మందిరాలను హిందూ సమాజానికి వాపసు ఇచ్చేయాలని ప్రజలు నిర్ణయించారని అలోక్ కుమార్ జీ డిమాండ్ చేశారు. ఈ పద్ధతి రెండుమూడు వందల సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చింది. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఈ పద్ధతి వచ్చింది. అప్పట్లో తమిళనాడు, బెంగాల్లో కంపెనీ నివేదికల్లో దేవాలయాల గురించి ఉంది. దేవాలయాల్లో గురుకులాలు ఉండేవి, విద్యాబోధన జరిగేది, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి, ప్రజలు ప్రతీ విషయాన్నీ ఆలయంలో నిర్ణయించుకునేవారు, పెళ్ళిళ్ళయినా, గొడవల పరిష్కారమైనా గుడిలోనే జరిగేవి. అంటే దేశంలోని వ్యవస్థ అంతా గుడుల మీద ఆధార పడి ఉండేది. దక్షిణ భారతదేశంలో 10లక్షలకు పైగా ఎకరాల భూమిని దేవాలయాలకు దానాలుగా ఇచ్చారు.
హిందూ సమాజపు ఏకతను దెబ్బతీయాలంటూ గుడుల పనితీరును నశనం చేయాలని బ్రిటిష్ వారికి అర్ధమైంది. ప్రభుత్వాలు మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, బౌధ్ధ, జైన మందిరాలు నిర్వహించవు, కానీ కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే నిర్వహిస్తాయి. ఒకటి డబ్బుల లూటీ కోసం, రెండు హిందూ సంప్రదాయాలను నాశనం చేయడం కోసం. కేరళ పద్మనాభస్వామి దేవాలయంలో గుడినుంచి బైటకు వెళ్ళేవారు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకని అడిగాను. ఆలయంలోని ఒక్క ధూళికణం కూడా బైటకు వెళ్ళకూడదని రాజుగారి ఉద్దేశం అని అక్కడి వారు చెప్పారు. ఇప్పుడా సంప్రదాయం నశించిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ గుడీ తమ ఆదాయంలో ప్రభుత్వానికి భాగం ఇవ్వాలి. 5శాతం కామన్ గుడ్ ఫండ్ కు డబ్బులివ్వాలి. పన్నులు చెల్లించాలి, ఎక్కువ ధరకు విద్యుత్ బిల్లులు కట్టాలి. అలా హిందూ ఆలయాల నుంచి వసూలు చేసిన డబ్బులను ప్రభుత్వాలు లౌకికవాదం పేరిట అందరికీ పంచాలి. ఇతర మతాలకు దోచిపెట్టాలి. గుడిలో ఎలాంటి ఉద్యోగులుండాలి, ఎవరిని బదిలీలు చేయాలి వంటి నిర్ణయాలు కమిషనర్లు తీసుకుంటున్నారు. అది ధర్మాచార్యుల పని కదా. ప్రభుత్వాధికారులు ఎందుకు చేస్తున్నారు. ఆ విధంగా దేవాలయ వ్యవస్థలను బలహీనం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు హిందువులు అందరూ అడుగుతున్నారు. ఇంకా ఇది చెల్లదు. ఆలయాలను హిందువులకు వాపసు చేయాలి.
కొంతమంది అడుగుతున్నారు…. 200 ఏళ్ళు గడిచిపోయాయి కదా, ఇప్పుడు ఆలయాలు ఎవరికి ఇవ్వాలి… విశ్వహిందూ పరిషత్‌కు ఇవ్వాలా? ఇది బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చడం కోసం జరుగుతున్న కుట్ర కాదా… అంటున్నారు. కానీ నిజం చూస్తే రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో అర్చకులు బ్రాహ్మణులు కాదు. దేవాలయాలను స్థానిక ట్రస్టులు నిర్వహించాలి. అందులో అన్ని కులాలవారూ ఉంటారు.
ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. తిరుపతి గుడిలో రోజూ ఆదాయ వ్యయాలు లెక్కిస్తారు. కంచి మఠంలోనూ అంతే. కాబట్టి దేవాలయాల ఆస్తుల విషయంలో ట్రస్టులు జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు ప్రభుత్వాల చేతిలో ఉన్న గుడులను హిందూ సమాజానికి ఇవ్వాలి. దానివల్ల గుడులు వైభవంగా నిర్వహించబడతాయి.
200 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా నిలువరించాలి. దానికి ఈ హైందవ శంఖారావం ప్రారంభం. రామజన్మభూమి తరహాలో హిందూ సమాజం మొత్తం ఏకత్రితమై ఈ ఉద్యమాన్ని చివరివరకూ నిర్వహిస్తుంది. జై శ్రీరాం.