Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు

డిఎపిపై అదనంగా రూ.3500 స్పెషల్ ప్యాకేజీ పొడిగిస్తామన్న కేంద్ర క్యాబినెట్

Phaneendra by Phaneendra
Jan 2, 2025, 10:40 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కొత్త సంవత్సరం మొదటిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలను వెల్లడించింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయం పరిమితిని పెంచుతూ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2019 నుంచీ రైతులకు రూ.6వేల పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందజేస్తున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రూ.10వేలకు పెంచారు. కిసాన్ నిధి మొత్తాన్ని పెంచుతూ బడ్జెట్ 2025-26లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయబోతున్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2025-26 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకాల అమలులో క్లెయిమ్‌ల లెక్కింపు, సెటిల్‌మెంట్ సామర్ధ్యం పెంచేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (ఫియట్ ) ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఫియట్‌ నిధులను యస్-టెక్, విండ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్ వంటి సాంకేతిక కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. టెక్నాలజీ ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ (ఎస్- టెక్) ద్వారా దిగుబడి అంచనాకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీనిని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక అమలు చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలను కూడా త్వరితగతిన దీని పరిధిలోకి తెస్తున్నారు. ఎస్-టెక్ విస్తృత అమలుతో పంట కోత ప్రయోగాలు, సంబంధిత సమస్యలు క్రమంగా తొలగిపోతున్నాయి. 2023-24 సంవత్సరానికి ఎస్-టెక్ క్లెయిమ్ లెక్కింపు, సెటిల్మెంట్లు పూర్తయ్యాయి.

మరోవైపు… వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్వర్క్ డేటా సిస్టమ్స్ (విండ్స్) ద్వారా బ్లాక్ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు (ఏడబ్ల్యూఎస్), పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్‌జీ) లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విండ్స్ కింద, హైపర్ లోకల్ వెదర్ డేటాను అభివృద్ధి చేయడానికి ప్రస్తుత నెట్‌వర్క్ సాంద్రతను 5 రెట్లు పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం కింద, డేటా అద్దె ఖర్చులను మాత్రమే కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. కేరళ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ , రాజస్థాన్‌లలో విండ్స్ టెక్నాలజీని అమలుచేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసాయి. దీని ప్రకారం 90:10 నిష్పత్తిలో అధిక కేంద్ర నిధుల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2024-25ను మొదటి సంవత్సరంగా కేంద్ర మంత్రివర్గం  ఆమోదించింది.

ఇంకా… డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) మీద ఇప్పటికే ఉన్న ఎన్‌బిఎస్ సబ్సిడీకి అదనంగా మెట్రిక్ టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్యాకేజీని 01.01.2025 నుండి తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దానివల్ల రైతులకు సహేతుకమైన ధరకు డీఏపీ ఎరువులు సజావుగా లభించేలా ఆమోదిత ఎన్‌బీఎస్ సబ్సిడీకి మించి మెట్రిక్ టన్నుకు రూ.3,500 చొప్పున ప్రత్యేక ప్యాకేజీని 01.01.2025 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అందిస్తారు.

ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆ మేరకు ప్రీమియం సబ్సిడీలో 90 శాతం ఈశాన్య రాష్ట్రాలతో కేంద్రం పంచుకుంటుంది. అయితే ఈ పథకం స్వచ్ఛందం కావడం, ఈశాన్య రాష్ట్రాల్లో పంటలు తక్కువగా పండడం కారణాలతో నిధులను వెనక్కు తీసుకోకుండా నిధుల అవసరం ఉన్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాల్లో  వాడేందుకు (రీలొకేషన్) వెసులుబాటు కల్పించారు.

Tags: Cabinet MeetingFarmer WelfarePM Fasal Bima YojanaPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.