ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారీగా పెరిగిన టీ, కాఫీ పొడి రేటు
పామాయిల్ ధర పెరుగుదల ప్రభావం సబ్బుల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపింది. సబ్బుల తయారీలో పామాయిల్ ముడిసరుకు కీలకం. ఇటీవల పామాయిల్‌పై దిగుబడి సుంకం పెరగడంతో పాటు దేశీయ మార్కెట్లో రేటు పెరగడంతో దాని ప్రభావం త్వరగా అమ్ముడయ్యే సరుకుల జాబితాలోని సబ్బులపై ప్రభావం చూపింది. హెచ్‌యూఎల్, విప్రో వంటి సంస్థలు సబ్బుల ధరలను దాదాపు 7 నుంచి 8 శాతం పెంచాయి.
తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్రస్తుత త్రైమాసికంలో సబ్బుల ధరల సవరణ ఉంటుందని పలు లిస్టెడ్ కంపెనీలు సూచనప్రాయంగా తెలిపాయి. వివిధ కారణాలతో పామాయిల్ ధరలు దాదాపు 35 నుంచి 40 శాతం ఎగశాయి. క్రీమ్స్, బాడీ లోషన్స్, పౌడర్లు కూడా మరింత ప్రియం కానున్నాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట ఉత్పత్తి తగ్గడంతో టీ, కాఫీ పొడి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలే కాఫీ, టీపొడి ధరలను కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. కొన్ని కంపెనీలు ఒక్కసారిగా ఎనిమిది శాతం వరకు ధర పెంచితే.. మరికొన్ని కంపెనీలు దశలవారీగా పెంచుతున్నాయి.