మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అంబరాన్ని తాకేలా సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి బిజెపి ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసారు. ఝార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బిజెపి ఓడిపోడానికి కారణాలను సమీక్షించుకుంటామన్నారు. విభజించి పాలించు, కులగణన చేసి పాలించు అనే కాంగ్రెస్ ఇండీ కూటమి నినాదాన్ని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
విజయోత్సవాన్ని బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్జీ ప్రారంభించారు. బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరాం, ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, నాగలక్ష్మి, రత్నకుమారి, మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్గా వ్యవహరించిన ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేసారు. నరేంద్రమోదీ నాయకత్వంలో డబుల్ఇంజన్ సర్కార్ను మహారాష్ట్ర ప్రజలు కోరుకున్న ఫలితమే బీజేపీ కూటమి విజయమని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ఎన్డీఎ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. నాందేడ్ జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉప ఎన్నిక జరిగిన పార్లమెంట్ స్థానం, అన్నింటిలోనూ బీజేపీ విజయం సాధించనందుకు హర్షం వ్యక్తం చేసారు.