ఛత్తీస్గఢ్ ఫరిధిలోని దండకారణ్యం తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్ లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్జీ బృందం మావోయిస్టులు నక్కిన ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది.
భద్రతా బలగాల రాకను పసిగట్టిన నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన బుల్లెట్ ఫైట్ లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలం నుంచి ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం ఉదయం భెజ్జి ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. బస్తర్ ప్రాంత్ ఐజీ పి. సుందర్ రాజ్ కూడా ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు.ల