ఛత్తీస్గఢ్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య మరోమారు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ పరిధిలో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన జారీ కావాల్సి ఉంది.
ఘటనాస్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసువర్గాలు వెల్లడించాయి.
ఛత్తీస్గఢ్ అబుజ్మడ్ అడవుల్లో అక్టోబర్ 4న అతిపెద్ద నక్సల్స్ ఆపరేషన్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన పది రోజుల తర్వాత అక్టోబర్ 14న మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. కాల్పుల్లో 35 మంది తమవారు చనిపోయారని పేర్కొన్నారు. అక్టోబర్ 18న బస్తర్ ఐజీ సుందర్రాజ్ మాట్లాడుతూ, ఆ ఎన్కౌంటర్లో మొత్తం 38 మంది చనిపోయారని తెలిపారు.