ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఆర్డీఏ విస్తీర్ణాన్ని 8,352 చదరపు కిలీమీటర్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది.
2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు , ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (ప్రోహిబిషన్)కు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రీఫెల్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
AP GST -2024 చట్ట సవరణ, ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ లక్ష్యాల సాధన, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.