సరిగ్గా ఐదురోజుల క్రితం సోమవారం నాడు ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో 19ఏళ్ళ యువతి శవం దొరికడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. ఆమె కనబడడం లేదంటూ ముందురోజే తల్లిదండ్రులు కేసు పెట్టారు. చివరికి ఆమెను హత్య చేసింది సలీమ్ అనే ముస్లిం వ్యక్తి అని బైటపడింది.
సంజూ అనే హిందూ పేరుతో సలీమ్ సోనియాతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమలోకి లాగాడు. గర్భవతిని చేసాడు. పెళ్ళి చేసుకోమని కోరింది. దాంతో చివరికి ఆమెను చంపేసాడు.
సోనియా తల్లిదండ్రులు పోలీసులతో తమ కుమార్తెకు పరిచయం ఉన్న సంజూ అనే వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పారు. పోలీసుల అన్వేషణలో సోనియా శవం దొరికింది. సలీం మరో ఇద్దరి సహాయంతో సోనియాను పీక పిసికి చంపేసాడు. ఢిల్లీ రోహ్తక్ ప్రాంతంలోని శ్మశానంలో ఆరడుగుల గొయ్యి తీసి కప్పెట్టేసాడు. సలీం పోలీసుల ముందు కన్ఫెషన్లో తను ఆమెను హిందూ పేరుతో మోసం చేసానని ఒప్పుకున్నాడు.
కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా సోనియా వారి మాట వినకుండా సంజూ అలియాస్ సలీంను గుడ్డిగా నమ్మింది. అతను ఆమెను గర్భవతిని చేసాడు. దాంతో పెళ్ళి చేసుకోవాలంటూ సోనియా సలీం దగ్గర పోరు పెట్టింది. దానికి ఒప్పుకున్నట్టు నటించిన సలీం, కర్వాచౌత్ పండుగ రోజు కలుసుకుందామని చెప్పాడు. ఆ రోజు ఉపవాసం ఉండి రమ్మని, సాయంత్రం పెళ్ళి చేసుకుని ఉపవాసం తర్వాతి భోజనం చేద్దామనీ చెప్పాడు.
సలీంను గుడ్డిగా నమ్మిన సోనియా ఆ రోజు సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి, సలీం దగ్గరకు వెళ్ళింది. అతను ఆమెను పెళ్ళి కోసమంటూ కారులో తీసుకువెళ్ళాడు. రితిక్, పంకజ్ అనే స్నేహితులను తనవెంట తెచ్చుకున్నాడు. అయితే పెళ్ళి చేసుకోడానికి బదులు సోనియాను చంపేసాడు. ఆమె శవాన్ని ఆరడుగుల గోతిలో కప్పెట్టాడు.
సోనియా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు సంజూ గురించి వివరించారు. తమకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటోందనే భావించారు తప్ప ఓ ముస్లిం వ్యక్తి మోసానికి బలై శవమైపోయిందని వారు గ్రహించలేకపోయారు.
ఢిల్లీ పోలీసులు సలీంను అరెస్ట్ చేసారు. అతనికి సహకరించిన పంకజ్, రితిక్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ సోనియాకు తనను మోసం చేసినవాడు సంజూ కాదు సలీం అన్న సంగతి తెలిసిందా లేదా అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.