పుణే టెస్ట్ లో న్యూజీలాండ్ ను ఎదుర్కొనేందుకు న్యూజీలాండ్ తీవ్రంగా శ్రమిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసిన న్యూజీలాండ్, భారత్‌ను 156 పరుగులకే పెవిలియన్ కు పంపింది. 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి 259 వద్ద ఆలౌటైంది. భారత్ గెలవాలంటే 359 పరుగులు చేయాలి.
198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్, మరో 57 పరుగులు మాత్రమే జోడించింది. కివీస్ ఇన్నింగ్స్ లో టామ్ లేథమ్ (86), గ్లెన్ ఫిలిప్స్ (48*), టామ్ బ్లండెల్ (41) రాణించారు. డేవిన్ కాన్వే (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర(9), మిచెల్ (18) నిరాశ పరిచారు. శాంటర్ (4), టిమ్ సౌథీ(0), అజాజ్ పటేల్ (0) ఓరూర్కీ(1) విఫలమయ్యారు.
కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక 359 పరుగుల లక్ష్యాన్ని మొదలు పెట్టిన భారత్, అప్పుడే ఒక వికెట్ నష్టపోయింది. రోహిత్ శర్మ(8), శాంటర్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. జైస్వాల్, శుభమన్ గిల్ ఆడుతున్నారు. ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది.