వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గురువారం ఉదయం 10.30కు విచారణకు రావాలని పేర్కొన్నారు. జగన్ హయాంలో 2021 అక్టోబర్ 19న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేసాయి. దానిపై కేసు నమోదయింది. దానికి సంబంధించి పలువురు వైసీపీ నేతలను ఇప్పటికే పోలీసులు విచారించారు.
ఆ కేసులో సజ్జల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఇప్పటివరకూ లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్లను పలుసార్లు పిలిపించి విచారించారు. ఆ నేపథ్యంలోనే తాజాగా సజ్జలకు నోటీసులు జారీ చేసారు.