Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు: పండుగ రద్దుచేసుకున్న బౌద్ధులు

Phaneendra by Phaneendra
Oct 8, 2024, 05:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లోని మైనారిటీ ప్రజలపై అత్యాచారాలు, పీడనలకు కనుచూపుమేరలో అంతమనేదే కనిపించడం లేదు. దుర్గాపూజ వేడుకలు జరుపుకోడానికి జిజియా పన్ను కట్టాలంటూ హిందువులను బెదిరించిన తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశీ ముస్లిములు బౌద్ధ సన్యాసుల మీద పడ్డారు. చిట్టగాంగ్ పర్వతప్రాంతాల్లోని బౌద్ధులు ఈ యేడాది ‘కథిన్ చిబార్ దాన్’ పండుగ జరుపుకోబోమని ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని బౌద్ధులకు అది పెద్ద పండుగ. భద్రతా కారణాల రీత్యా ఈ యేడాది అంత ప్రధానమైన పండుగ చేసుకోబోమని వాళ్ళే నిర్ణయించుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.   

రంగమతి ప్రాంతంలోని మైత్రీ బౌద్ధ విహారంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో పర్బత్య భిక్షు సంఘ అధ్యక్షుడు శ్రద్ధాలంకార్ మహతెరో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితి, అభద్రత కారణంగా చిట్టగాంగ్ పర్వత ప్రాంతంలోని ఏ బౌద్ధమందిరంలోనూ ఈ యేడాది పండుగ జరగబోదని స్పష్టం చేసారు. నిజానికి ఆ పండుగ నవంబర్ మొదటివారంలో జరగాల్సి ఉంది.

దేశంలో మైనారిటీలపై హింసాకాండ నానాటికీ పెరుగుతూనే ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బౌద్ధసాధువులు వివరించారు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్ (సిహెచ్‌టి)లో హింసాకాండకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణం పోలీసు విభాగం శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమవడమేనని ఆరోపించారు. మతపరమైన దాడుల విషయంలో పేరుకు దర్యాప్తు కమిటీలను ఏర్పాటు చేసినా, ఆ కమిటీలను దర్యాప్తు చేయనీయడం లేదని వారు వివరించారు.

సెప్టెంబర్ 18, 20, అక్టోబర్ 1 తేదీల్లో ఖాగ్రాచారీ, రంగమతి పర్వత ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల గురించి శ్రద్ధాలంకార్ మహతెరో వివరించారు. ఆ మూడు రోజుల్లో ముస్లిం సెటిలర్లు స్థానిక ఆదివాసీ గిరిజన ప్రజల ఇళ్ళు లూటీ చేసి ధ్వంసం చేసారు, వందలాది దుకాణాలను తగులబెట్టేసారు. ఆ దాడుల్లో నలుగురు ఆదివాసీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక విద్యార్ధి కూడా ఉన్నారు. బౌద్ధ దేవాలయాల్లో హుండీలను దొంగతనం చేసారు, బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసారు.

బౌద్ధమతాన్ని పాటించేవారు బౌద్ధసాధువులకు ‘చిబార్’ అని పిలిచే ప్రత్యేక దుస్తులను ప్రతీయేటా ఒకసారి దానం చేస్తారు. అదే ‘కతిన్ చిబార్ దాన్’ పండుగ. ఆ దుస్తులను భక్తులు ఒక్కరాత్రిలో చేతితో నేస్తారు. ఈ వేడుక 2500 సంవత్సరాల క్రితం విశాఖుడు అనే గౌతమబుద్ధుడి సేవకుడు ప్రారంభించాడు.

దుర్గాపూజ మండపాలపై దాడులు:

బెంగాలీ హిందువులకు అత్యంత ప్రధానమైన దసరా శరన్నవరాత్రులు జరుపుకోడానికి వీల్లేకుండా బంగ్లాదేశ్‌లోని ముస్లిం ఛాందసవాదులు దాడులకు పాల్పడుతూన్నారు. సెప్టెంబర్ 28న రిషిపర బర్వారీ పూజామండపం మీద, అక్టోబర్ 1న మనికడి పాల్పరా బర్వారీ పూజామండపం మీద దాడులు జరిగాయి. దుర్గామాత, ఇతర హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసారు. బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహీ డివిజన్ పబ్నా జిల్లా సుజానగర్ ఉపజిల్లాలో ఈ రెండు ఘటనలూ చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద, ప్రత్యేకించి హిందువుల మీద ముస్లిం ఛాందసవాదులు చేస్తున్న దాడుల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి.

మనికడి పాల్పరా బర్వారీ పూజామండపం వద్ద ఐదు దేవతా విగ్రహాలను, రిషిపరా బర్వారీ పూజామండపం వద్ద నాలుగు దేవతా విగ్రహాలను ధ్వంసం చేసారు. అక్టోబర్ 3న అంటే శరన్నవరాత్రుల మొదటిరోజు గోపీనాథ్ జియూర్ అఖాడా దుర్గాపూజా మండపంలో ఏడు దేవతా విగ్రహాలను ధ్వంసం చేసారు.

ఆగస్టు 5న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన నాటినుంచీ ఇప్పటివరకూ హిందువుల గుడులు, దుకాణాలు, ఇళ్ళపై కనీసం 205 దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

Tags: andhra today newsAtrocities on MinoritiesBangladeshBuddhistsChittagong Hill TractsDurga Puja PandalsFestival CancelledHindu Idols VandalizedKathin Chibar DanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్
general

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.