మిగతా 2 శాతం మందికి సోమవారం జమ
ఆంధ్రప్రదేశ్ లో వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద బాధితులకు కేటాయించిన రూ.602 కోట్ల పరిహారంలో రూ.18 కోట్లు మాత్రమే మిగిలాయని వివరించింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో సోమవారం నగదు జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం అందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 15 వేలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో బాధితులకు ప్రభుత్వం పరిహారం అందజేసింది.