పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. గత వారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో హిజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా హతమయ్యాడు. బీరుట్లో జరిపిన దాడుల్లో హసన్ నస్రల్లా చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ సిరియాలోని మజ్జే జిల్లాలో ఉగ్రవాదులే లక్ష్యంగా భవనాలపై జరిపిన దాడుల్లో నస్రల్లా అల్లుడు జాఫర్ అల్ ఖాసిర్ హతమయ్యాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో పలువురు మరణించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పౌరుడు మరణించాడు. అమెరికా పౌరుడు కమెల్ అహ్మద్ జావెద్ మరణంపై వైట్‌హౌస్ సంతాపం వ్యక్తం చేసింది. తమ దేశ పౌరుడు ప్రాణాలు కోల్పోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతాపం తెలిపారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్