బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పార్లమెంటరీ కమిటీలో చోటుదక్కింది. పార్లమెంటరీ కమిటీల జాబితాతో రాజ్యసభ సెక్రటేరియట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
డిఫెన్స్ కమిటీలో లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి చోటు లభించింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. రక్షణ, ఆర్థిక, హోం, బొగ్గు, గనులు, ఉక్కు, సమాచార, ఐటీ కమిటీలకు బీజేపీ ఎంపీలు సారథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు నాలుగు కమిటీల సారథులుగా ఉన్నారు.
విదేశీ వ్యవహారాల కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, విద్య, మహిళా, శిశు, యువత, క్రీడలకు సంబంధించిన కమిటీకి దిగ్విజయ్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఇక వ్యవసాయం, పశువులు, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చరణ్ జిత్ సింగ్ చన్నీ, గ్రామీణం, పంచాయతీరాజ్ కమిటీకి సప్తగిరి శంకర్ అధ్యక్షత వహిస్తారని రాజ్యసభ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.