దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్ళే ప్రయాణీకుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది.
అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున రాకపోకలు సాగించనున్నాయి. ఈవిషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
సికింద్రాబాద్-తిరుపతి సర్వీసు అక్టోబరు 5 నుంచి నవంబరు 9 వరకు ప్రతీ శనివారం బయల్దేరుతుంది.తిరుపతి-సికింద్రాబాద్ రైలు అక్టోబరు 8 నుంచి నవంబరు 12 వరకు ప్రతీ మంగళవారం, తిరుపతి-శ్రీకాకుళం రోడ్ రైలు అక్టోబరు 6 నుంచి నవంబరు 10 వరకు ప్రతీ ఆదివారం నడవనుంది.
శ్రీకాకుళం రోడ్-తిరుపతి రైలు అక్టోబరు 7 నుంచి నవంబరు 11 వరకు ప్రతీ సోమవారం బయల్దేరుతుంది.