బజాజ్ హైసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అదరగొట్టింది. సబ్‌స్క్రిప్షన్‌కు విశేష స్పందన దక్కింది. 63.6 రెట్ల అధిక స్పందన నమోదైంది. రూ.6500 కోట్ల విలువైన 727575756 షేర్లను ఆఫర్ చేయగా, 46274843832 షేర్లకు అంటే రూ.3.8 లక్షల కోట్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగత పెట్టుబడిదారుల కోటాలో 209 రెట్ల అధికంగా సబ్‌స్క్రియిబ్ అయింది. ఇతర కోటాలో 41 రెట్లు, రిటైల్ విభాగంలో 7.02 రెట్లు అధిక స్పందన లభించింది.
ఏడాడి కిందట మార్కెట్లోకి వచ్చిన టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రూ.2.1 లక్షల బిడ్లు రాగా ఆ రికార్డును బజాజ్ హౌసింగ్ పైనాన్స్ బద్దలు కొట్టింది. తాజాగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.3560 కోట్ల షేర్లను జారీ చేసింది. మరో రూ.3 వేల కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్‌కు విక్రయించనుంది. ఒక్కో షేరు ధర రూ.66 నుంచి రూ.70గా కంపెనీ నిర్ణయించింది. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ అంటే 214 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది. బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది.