శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ కృష్ణాతారం చాలా ప్రత్యేకమైనది. దుష్ట సంహారం కోసం మానవుడిగా జన్మించి మానావాళకి ఎంతో అవసరమైన గీతను స్వామివారు ప్రభోదించారు. దక్షిణాయనం శ్రావణమాసం కృష్ణపక్షం అర్ధరాత్రి సమయం అష్టమి తిథిలో రోహణి నక్షత్రం ఉండగా శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. మధురలోని బృందావనం స్వామి వారి జన్మభూమి.
నేడు పరమ పవిత్రమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణా’ అని ప్రధాని మోదీ హిందీలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రీకృష్ణ భగవానుడు ప్రజలను ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉండాలని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమేనన్నారు. శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని అభిప్రాయపడ్డారు. కృష్ణాష్టమి సందర్భంగా నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాని ట్వీట్ లో పేర్కొన్నారు.
‘గీత బోధనలు ప్రభావశీలమైనవి, ప్రతీ దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.