శ్రీశైలం ప్రాజెక్టు మరోసారి పూర్తిగా జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తి వరదను విడుదల చేశారు. ఇవాళ ఉదయం మూడు గేట్లు ఎత్తి 95 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 70 వేల క్యూసెక్కులు వదిలారు. పోతిరెడ్డిపాడుకు 26వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2600, బీమా,కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 8900 క్యూసెక్కులు వదిలారు. 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో (srisailam dam flood) ప్రస్తుతం 214 టీఎంసీల జలాలున్నాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో (nagarjunasagar project gates lifted)ఇవాళ ఉదయం 2 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. పూర్తిగా నిండిపోవడంతో 16 వేల క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేశారు. కాలువల ద్వారా 24000 క్యూసెక్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 22 గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాలువలకు 17600 క్యూసెక్కులు వదిలారు.