భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విద్యార్థుల కోసం క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. బ్యాంకు ఏర్పాటై 90 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ‘ఆర్బీఐ90క్విజ్’ పేరుతో ఈ పోటీలు నిర్వహించనుంది.
రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఈ పోటీలు నాలుగు దశల్లో ఉంటాయి. మొదట ఆన్లైన్ విభాగంలో పోటీ ఉంటుంది. ఆ తర్వాత స్టేట్, జోనల్, ఫైనల్ దశల్లో క్విజ్ నిర్వహిస్తారు. జనరల్ అవేర్నెస్పై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా క్విజ్ సెప్టెంబర్లో జరగనుంది.
క్విజ్ లో ఫైనల్ విజేతకు రూ. 10 లక్షలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.8లక్షలు, రూ.6 లక్షలు అందజేస్తారు.
రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి రూ.2లక్షలు కాగా, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.1.5 లక్షలు, మూడో బహుమతి రూ.1లక్ష ఉంటుంది. అదే జోన స్థాయిలో అయితే వరుసగా రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున బహుమతులు ఉంటాయి.