భారత టెన్నిస్ వెటరన్ రోహన్ బోపన్న కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత్ తరఫున ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు పేర్కొన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైన అనంతరం ఈ నిర్ణయాన్ని తెలిపాడు. ఇక నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోనన్నాడు. దేశం తరపున ఇదే తన చివరి మ్యాచ్ అని పేర్కొన్న బోపన్న, ఆటపరంగా తాను ఏ స్థితిలో ఉన్నానో స్పష్టంగా అర్థమైందన్నారు.
ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బోపన్న-శ్రీరామ్ బాలాజీ.. 5-7, 2-6తో రోజర్-మొన్ఫిల్స్ (ఫ్రెంచ్) చేతిలో పరాజయం చెందారు. మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఏటీపీ టోర్నీల్లో ఆడతానని స్పష్ట చేశాడు. 2026 జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.
ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్న బోపన్న కల నెరవేరలేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి ఆడాడు. ఆ టోర్నీలో కాంస్య పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు.