Sunday, July 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

నాలుగేళ్ళ పాపను రేప్ చేసి చంపేసిన ఇమ్రాన్‌ఖాన్

Phaneendra by Phaneendra
Jul 25, 2024, 01:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కర్ణాటక రామనగర జిల్లా మాగడి పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ళ బాలికను ఎత్తుకుపోయి, అత్యాచారం చేసి, చంపేశాడొక నీచుడు. గత శనివారం (జులై 20) బాలిక మాయమయ్యాక, మొన్న సోమవారం (జులై 22) ఆమె మృతదేహం తిప్పగొండనహళ్ళి దగ్గర దొరికింది. ఆ బాలిక బంధువైన ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తే ఆ దుర్మార్గానికి పాల్పడ్డాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఇమ్రాన్‌ఖాన్ అనే వ్యక్తి బెంగళూరులోని గౌరీపాళ్య ప్రాంతంలో నివసించేవాడు.  బాధిత బాలిక కుటుంబానికి అతను బంధువు. బెంగళూరుకు, మాగడికి 30కిలోమీటర్లే దూరం కావడంతో వారింటికి అతను తరచుగా వచ్చి వెడుతుండేవాడు. జులై 20న ఇమ్రాన్‌ఖాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పాపను తనతో తీసుకువెళ్ళి ఆమెకు ఐస్‌క్రీమ్ కొనిపెట్టాడు.

అదేరోజు సాయంత్రం 5గంటలకు మళ్ళీ ఐస్‌క్రీమ్‌ కొనిపెడతానని ఆశపెట్టి ఆ బాలికను తన స్కూటర్‌ మీద తీసుకుని వెళ్ళాడు. మాగడికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పగొండనహళ్ళి ప్రాంతానికి తీసుకువెళ్ళి, అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు. తర్వాత గొంతు నులిమి హత్య చేసాడు. బాలికను చంపేసాక నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.

ఆ రాత్రి బాలిక తల్లి, తన కుమార్తె ఇంట్లో లేకపోవడంతో ఇమ్రాన్‌కు ఫోన్ చేసింది. అయితే పాపను ఇంటిముందు వదిలిపెట్టి తాను బెంగళూరు వెళ్ళిపోయానని చెప్పాడు. తర్వాత తన ఫోన్ స్విచాఫ్ చేసేసాడు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మాగడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిసిటివి ఫుటేజ్‌లో బాలిక ఇమ్రాన్‌తో పాటు వెళ్ళడం గమనించారు. రెండురోజుల వెతుకులాట తర్వాత సోమవారం రాత్రి 7గంటల సమయంలో తిప్పగొండనహళ్ళిలో ఒక పెద్ద రాతికింద బాలిక నగ్నదేహం లభ్యమైంది.

పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను మంగళవారం ఉదయం బెంగళూరు కళసిపాళ్య వద్ద అరెస్ట్ చేసారు. విచారణలో నిందితుడు తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.

బెంగళూరులోని రాజరాజేశ్వరి ఆస్పత్రిలో బాలిక మృతదేహానికి పంచనామా నిర్వహించి, శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సంఘటన మాగడి పట్టణంలో ప్రజాగ్రహానికి దారితీసింది.

మంగళవారం ఉదయం వెయ్యిమందికి పైగా ప్రజలు పెద్దస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిందితుణ్ణి వెంటనే ఉరి తీయాలి లేదా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసారు. మాగడి పట్టణంలో వందలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు.

నిందితుడు బాలికను రేప్ చేసే ఉద్దేశంతోనే మాగడి వెళ్ళాడని పోలీసులు అంచనాకు వచ్చారు. అతనిపై భారతీయ న్యాయ సంహితలోని 103, 135 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం ప్రకారం కూడా కేసు నమోదు చేసారు. నిందితుణ్ణి మంగళవారం ఉదయం మాగడి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్ చేసారు.

Tags: KarnatakaMagadiMinor Girl Rape and MurderSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.