విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం నుంచి ఆషాడ మాసం సందర్భంగా పవిత్ర సారేను సమర్పించారు. శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం నుంచి ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి దుర్గ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆలయ ప్రాంగణంలోని మహామండపం 6వ అంతస్తు లో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందజేశారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు