శ్రీశైలం క్షేత్రంలో వింత ఘటన చోటుచేసుకుకంది. మల్లికార్జున స్వామికి ప్రతిరూపమైన చంద్రలింగం వద్దకు వచ్చిన నాగుపాము కాసేపు పడగవిప్పి పెనవేసుకుంది. ఈ ఘటనను చూసిన భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలోని పాతాళ గంగ వద్ద చంద్రలింగం ఉంటుంది. భక్తులు నిత్యం ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇక్కడే మంగళవారం అద్భుతం జరిగింది. నాగుపాము శివలింగాన్ని చుట్టుకుని పడగవిప్పింది. అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు తిరుగాడటం సాధారణమేనని కానీ ఇలా లింగాన్ని ఓ పాము చుట్టుకుని కనిపించడం ఇదే మొదటిసారని పలువురు చెబుతున్నారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు