చిన్నారుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్‌లోని నాలుగు జిల్లాల్లో చాందీపుర వైరస్ కారణంగా ఆరుగురు చిన్నారులు చనిపోయారు. 12 మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా ఆరావళి, మహిసాగర్, ఖేడా, సబర్‌కాంతా జిల్లాలకు చెందిన చిన్నారులు చాందీపురా వైరస్ భారిన పడినట్లు వైద్య ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ వెల్లడించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన చిన్నారులకు కూడా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వైరస్‌ను పరీక్షించేందుకు శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు మంత్రి తెలిపారు.
గుజరాత్‌లో ఇప్పటికే 18 వేలకు పైగా రక్త నమూనాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. ఈ వైరస్ అంటు వ్యాధి కాదని, దోమల ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని గుజరాత్ వైద్య మంత్రి రుషికే్ పటేల్ చెప్పారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు