బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఆవర్తనం రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
దీంతో కోస్తా ప్రాంతంలో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఉత్తరాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు, పడమరగా ద్రోణి ఏర్పడింది. రుతుపవన ద్రోణి రాయపూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది.
గత ప్రభుత్వంపై ఉపముఖ్యమంత్రి డ్రగ్స్ వ్యాఖ్యల కలకలం