ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన కల్కి చిత్రం మరో రికార్డు నమోదు చేసింది.రూ. 900 కోట్ల వసూళ్లు దాటిన పదో భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.900 కోట్లు వసూలు చేసింది. మరో వారంలో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దంగల్ చిత్రం రూ.2070 కోట్లు వసూలు చేసి, భారతీయ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్‌గా నిలిచింది. బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్, చాప్టర్ 2, జవాన్, చిత్రాలు కూడా భారీ వసూళ్లు చేసి అత్యధిక మొత్తం సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కల్కి 2898 మూవీ వాటి జాబితాలో చేరింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు