ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర నిలిపివేశారు.గార్వాల్ జిల్లాలో కొండచరియలు విరిగి పడుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో 9 జిల్లాల్లో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో వందకుపైగా ప్రాంతాల్లో రహదారులను మూసివేశారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరద ముంచెత్తుతోంది. కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు చనిపోయిన విషయం తెలిసిందే. బైక్‌పై బద్రీనాథ్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వారిపై కొండ చరియలు విరిగిపడ్డాయని పోలీసులు తెలిపారు. రాబోయే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు