పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక అందజేసింది.
నేటి (శుక్రవారం) మధ్యాహ్నం దిల్లీలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిజనిర్ధారణ కమిటీ సభ్యలు నివేదిక అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల రోజు ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఆ హింసాత్మక ఘటనలపై అధ్యయనం కోసం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో బీజేపీ నిజనిర్ధారణ కమిటీని వేసింది.